Sunday, May 5, 2024
- Advertisement -

టీమిండియాతో ఒప్పో ఔట్‌…బైజుస్ ఇన్‌

- Advertisement -

త్వ‌ర‌లో టీమిండియా జెర్సీ బ్రాండ్ మార‌నున్నంది. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగే సిరీస్ నుంచి టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై ఒప్పో బ్రాండ్‌కు బ‌దులు కొత్త బ్రాండ్ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ప్ర‌స్తుతం టీమిండియాకు స్పాన్స‌ర్ చేస్తున్న చైనాకు చెందిన మొబైల్ సంస్థ ఒప్పో స్పాన్సర్‌షిప్‌ను ర‌ద్చు చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ ఒప్పో.. 2017 మార్చిలో టీమిండియా స్పాన్సర్‌షిప్‌ను రూ.1079 కోట్లకు ఐదేళ్ల పాటు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఓ ఆంగ్ల పత్రిక తెలిపిన వివరాల ప్రకారం.. ఒప్పో సంస్థ తమ స్పాన్సర్‌షిప్‌ను రద్దు చేసుకుందని, 2017లో అధిక వ్యయానికి ఒప్పందం కుదుర్చుకున్నామనే కారణంతో తప్పుకోవాలని చూస్తోందట. అంత మొత్తంలో తాము చెల్లించలేమనే ఒప్పో వైదొలుగుతున్నట్లు పేర్కొంది. అయితే ఒప్పో స్థానంలో అదే కాల వ్యవధికి అంతే మొత్తంలో బీసీసీఐకి చెల్లించడానికి ముందుకు వచ్చిందని బైజుస్ సంస్థ‌.

టీమిండియా ఆడే ద్వైపాక్షిక మ్యాచ్‌లకు ఒప్పో సంస్థ ఒక్క రోజుకు రూ 4.61 కోట్లు చెల్లించగా ఐసీసీ ఈవెంట్లకు రూ.1.56 కోట్లు చెల్లించేది. అంతకుముందు స్టార్‌ ఇండియా ఒక్కో మ్యాచ్‌కు 1.92 కోట్లు చెల్లించగా ఐసీసీ ఈవెంట్లకు రూ.61 లక్షలు మాత్రమే చెల్లించేదని తెలుస్తోంది. సెప్టెంబర్‌ 15న ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటన నుంచి బెంగళూరుకు చెందిన ఆన్‌లైన్‌ ట్యుటోరియల్‌ సంస్థ బైజుస్‌ తన బ్రాండ్‌ను కొనసాగించనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -