ఆటగాళ్ల భార్యల మధ్య విబేధాలపై స్పందించిన కోచ్ రవిశాస్త్రి..

కొద్ది రోజులుగా కోహ్లీ, రోహిత్ మధ్య ఉన్న విబేధాలకు కోహ్లీ పుల్ స్టాప్ పడింది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చారు. టీమిండియా ఆటగాళ్ల భార్యల మధ్య గొడవలు ఉన్నాయనే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలను కోచ్ రవిశాస్త్రి ఖండించారు. ఇవన్నీ అసత్య వార్తలు అని కొట్టిపడేశారు. రానున్న రోజుల్లో ఆటగాళ్ల భార్యలు బ్యాటింగ్ చేస్తున్నారని, బౌలింగ్ చేస్తున్నారనే వార్తలను కూడా చదవాల్సి వస్తుందేమోనని సెటైర్ వేశారు. అన్ని ఫార్మాట్లలో టీమిండియా అద్భుతంగా రాణిస్తోందని అన్నారు. ప్రపంచకప్ లో కూడా మన జట్టు అద్భుతమైన ఆటతీరును కనబరిచిందని చెప్పారు. గత 18 నెలల్లో టెస్టుల్లో అద్భుతంగా రాణించామని, వన్డేల్లో పరుగుల వరద పారించామని తెలిపారు. ప్రపంచకప్ లో గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని… ఓడినంత మాత్రాన మన ఆటగాళ్ల ప్రదర్శనను తక్కువ చేసి మాట్లాడలేమని అన్నారు.