వెస్టిండీస్‌తో క్వీన్స్‌పార్క్ ఓవల్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో సెంచరీతో కదం తొక్కిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డును అధిగమించాడు. 26 ఏళ్లుగా పాక్ క్రికెటర్ మియాందాదాపై ఉన్న రికార్డును బద్దలు కొట్టారు.
ఇప్పటి వరకూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ 1930 పరుగులతో నెం.1 స్థానంలో ఉండగా.. ఈ రోజు మ్యాచ్ ముందు వరకూ 1912 పరుగులతో రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ.. తాజాగా 20 పరుగులతో అతడ్ని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి ఎగబాకాడు. అప్పటినుంచి మియాందాద్ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు.
అప్పట్లో మియాందాద్ 64 ఇన్నింగ్స్‌లో 1930 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ కేవలం 34 ఇన్నింగ్స్‌ల్లో ఆ రికార్డ్‌ని బద్దలు కొట్టడం విశేషం.విండీస్‌పై అత్యధికంగా కోహ్లి 7 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి, జావెద్ మియాందాద్ తర్వాత దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ కలిస్ (1666), పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రజా (1624), సచిన్ టెండూల్కర్ (1573) టాప్-5లో ఉన్నారు