మెగా స్టార్ చిరంజీవి నటించిన చిత్రం సై రా నరసింహ రెడ్డి అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా దసరా పండుగ కి ముందుగా విడుదల కావడం తో, సినిమా కి మంచి టాక్ వస్తే పండుగ పూట ప్రేక్షకులు సినిమా ని బాగా ఎంజాయ్ చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే, అది పక్కన పెడితే, ఇప్పుడు దాని కన్నా ముందే ఇంకొక మెగా హీరో సినిమా విడుదల కానుండటం తో అభిమానులకి నిజమైన సినిమా పండుగ ఇంకా ముందుగా నే మొదలవుతుంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా రానున్న చిత్రం వాల్మీకి మొదటగా వచ్చే నెల 13 న విడుదల కావాల్సి ఉంది కానీ నాని నటించిన గ్యాంగ్ లీడర్ అదే రోజు రానుండటం, ఆ సినిమా కి సోలో రిలీజ్ ఇవ్వాలనే ఉదేశ్యం తో వాల్మీకి వాయిదా పడటం జరిగింది.
సో వాల్మీకి 13 న విడుదల కానుంది. అంటే సై రా విడుదల కి కరెక్ట్ గా పది రోజుల ముందు అన్న మాట. వాల్మీకి కి కూడా హిట్ టాక్ వస్తే ఈ సారి దసరా పండుగ మెగా అభిమానులకి చాలా ముందే మొదలవుతున్నట్టు లెక్క.