Tuesday, May 14, 2024
- Advertisement -

దిల్ రాజు చొరవ తో వాల్మీకి వాయిదా

- Advertisement -

నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చే నెల 13 న ప్రేక్షకుల ముందు కు రానుంది అనే ప్రకటన ఎప్పుడో వచ్చింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో ఈ సినిమా రానుంది. విడుదల తేదీ లో వెనక్కి తగ్గేది లేదు అని ఎప్పుడో ప్రకటించారు దర్శక నిర్మాతలు. అంతే కాకుండా అదే రోజున హరీష్ శంకర్ దర్శకత్వం లో వాల్మీకి అనే సినిమా కూడా రానుండటం తో ప్రేక్షకులు అయోమయం లో పడ్డారు. అంతే కాకుండా ట్రేడ్ వర్గాల్లో కూడా చర్చలు మొదలయ్యాయి.

నాని మరియు వరుణ్ తేజ్ ఇద్దరూ మంచి మార్కెట్ ఉన్న హీరోలు. వాళ్ళు తీసుకొస్తున్న రెండు సినిమాల్లో మంచి కంటెంట్ ఉండేలాగా కనిపిస్తుంది. ఈ నేపథ్యం లో ఏదో ఒక సినిమా కే కొంచెం మంచి టాక్ వచ్చి, ఇంకో సినిమా కి కాస్త నెగటివ్ టాక్ వస్తే ఇంక ఆ నెగటివ్ టాక్ వచ్చిన సినిమా పుంజుకునేందుకు ఆస్కారం ఉండదు. అందుకే క్లాష్ అవ్వకుండా ఎవరో ఒకళ్ళు వెనక్కి తగ్గితే మంచిది అని అంతా ముందు నుంచే చర్చించుకున్నారు.

అయితే ఈ విషయమై దిల్ రాజు చొరవ తీసుకొని, ఇరు సినిమాల నిర్మాతల తో మాట్లాడి, వాల్మీకి ని 20 న వచ్చే లాగ చేసాడు. గ్యాంగ్ లీడర్ 13 న రానుంది. వాల్మీకి 20 న రానుంది. ఇంతకు ముందు కూడా పలు మార్లు ఇలా క్లాష్ వచ్చిన తరుణం లో దిల్ రాజు చొరవ తీసుకున్న సంగతి మనకి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -