ఈ మధ్యనే ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లక్ష్మీ, శరణ్య పొంవణ్ణన్ మరియ ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.
కేవలం రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తే ఈ సినిమా కథ నాని మరియు ఐదుగురు ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతుందని వారి జర్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది అని తెలుస్తోంది. పెన్సిల్ పార్థ సారథి అనే రివెంజ్ రైటర్ పాత్రలో ఉన్నానని ఐదుగురు ఆడవాళ్ళకి కార్తికేయ రివెంజ్ తీసుకోవడం లో హెల్ప్ చేయాలనుకుంటాడు. వారి మధ్య జరిగే ఫన్నీ జర్నీ నే సినిమా. ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మంచి అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 13, 2019 న విడుదల కాబోతోంది.