Saturday, May 18, 2024
- Advertisement -

ఫోర్జరీ కేసులో టీడీపీ మాజీ మంత్రి..కోర్టు ఆదేశాలతో కేసు నమోదు

- Advertisement -

అధికారంలో ఉన్నప్పుడు అడ్డమైన పనులు చేసిన టీడీపీ మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. కేట్యాక్స్, అసెంబ్లీ ఫర్నీచర్ ను ఇంటికి తరలించికేసులతో మాజీ స్పీకర్ కోడెల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మైనింగ్ కేసులో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అజ్ణాతంలో ఉన్నారు. ఇప్పటికే ఆయనపై సీబీఐ విచారణ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి కూడా ఫోర్జరీ కేసులో బుక్ అయ్యారు.

ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి భూమిని విక్రయించినట్లు ఆరోపణలపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమిరెడ్డితో పాటూ మరో ముగ్గుర్ని ఈ కేసులో నిందితులుగా చేర్చారు నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసులు. వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 58-3లో 2.40 ఎకరాల భూమికి ఫోర్జరీ చేసి తన పేరుతో రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత భూమిని చెన్నై నగరానికి చెందిన మేఘనాథన్, ఏఎం జయంతిలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు.

సోమిరెడ్డి అక్రమంగా ప్రభుత్వ భూమిని అమ్ముకున్నారని ఆయన పై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలంటూ ఇడిమేపల్లికి చెందిన రంగారెడ్డి అనే వ్యక్తి కోర్టులో కేసు వేశారు. కోర్టు ఆదేశాల మేరకు సోమిరెడ్డి మీద కేసు నమోదు చేశారు వెంకటాచలం పోలీసులు.

న్యాయస్థానం ఆదేశాల మేరకు మంగళవారం సోమిరెడ్డితోపాటు వీఆర్‌ మేఘనాథన్, ఏఎం జయంతి, సర్వేయర్‌ సుబ్బరాయుడులపై 471, 468, 447, 427, 397 సెక్షన్ల కింద పోలీసలు కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించని సోమిరెడ్డి తన న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -