- Advertisement -
అఫ్గానిస్థాన్ బ్యాట్స్‌మెన్ రహ్మత్ షా అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టులో శతకం సాధించిన రహ్మత్ షా (102: 187 బంతుల్లో 10×4, 2×6).. అఫ్గానిస్థాన్ తరఫున టెస్టుల్లో సెంచరీ బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లో నిలిచాడు.ఈ బ్యాట్స్‌మన్ ఇంతకు ముందు ఐర్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో 98 పరుగులు సాధించి తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్‌పై ఈ ఘనత సాధించాడు.
ఫస్ట్ డౌన్లో వచ్చిన రహ్మత్ షా సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. మూడో వికెట్‌కు 29 పరుగులు జత చేసిన రహ్మత్ షా.. నాల్గో వికెట్‌కు 120 పరుగుల్ని జత చేశాడు. ఈ క్రమంలోనే సెంచరీ మార్కును చేరాడు. టీ బ్రేక్ తర్వాత సెంచరీ పూర్తి చేసుకున్న రహ్మత్ షా జట్టు స్కోరు 197 వద్ద ఔటైపోయాడు.