Friday, May 3, 2024
- Advertisement -

బోర్డర్ టెన్షన్…టెన్షన్..పీవోకేలో 2 వేల మంది సైనికులను మోహరించిన పాక్..

- Advertisement -

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్,భారత్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. పాక్ కాశ్మీర్ కోసం యుద్ధం చేయడానికైనా సిద్దమని ఆ దేశ ప్రధానితో సహా మంత్రులు ప్రకటించారు. కాశ్మీర్ విషయంలో పాక్ అంతర్జాతీయంగా ఒంటరి కావడంతో ఉద్రిక్తతలను మరింత పెంచేలా పాకిస్థాన్ వ్యవహరిస్తోంది.

తాజాగా పీవోకేలోని నియంత్రణ రేఖ వద్దకు భారీ ఎత్తున సైనికులను పంపించింది. నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో బాగ్, కోట్లీ సెక్టార్లలో 2 వేల మందికి పైగా సైనికులను మోహరింపజేసిందని ఇండియన్ ఆర్మీ తెలిపింది.ఇప్పటికే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ తమ సైన్యాన్ని తరలించడం మరింత టెన్షన్ ప్రారంభమైంది.

ప్రస్తుతం వీరు దాడి చేసే యత్నాల్లో లేరని, అయినా వీరి కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. కశ్మీర్ లో ఉగ్రకార్యకలాపాలకు మళ్లీ ఆజ్యం పోస్తున్న పాకిస్థాన్… ఇదే సమయంలో బోర్డర్ లో బలగాలను పెంచుతుండటం గమనార్హం.మరోవైపు అక్టోబర్ నవంబర్ నెలలో పాకిస్థాన్ యుద్దానికి దిగుతుందంటూ పాకిస్థాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -