Wednesday, May 8, 2024
- Advertisement -

ఈటలను ఈ స్కాం క్లోజ్ చేస్తుందా?

- Advertisement -

వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా ఒక ముక్క ఎక్కువే పడుతుందనేది సామెత. ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎందుకోగాని టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను కేసీఆర్ దూరం పెడుతూ వచ్చారు. ఆయన సొంత పత్రికలో ఈటెలపై వ్యతిరేకవార్తలు వచ్చాయి. దీంతో గులాబీకి ఓనర్లం మేమే అని కేసీఆర్ కు వ్యతిరేకంగానే ఈటల గళమెత్తారు.

అప్పటి నుంచి ఈటలకు టీఆర్ఎస్ లో సాగనంపే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రచారం జరిగింది. పరిణామాలు కూడా ఈటల రాజేందర్ ను బుక్ చేసేలా ఉండడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.

తాజాగా హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో వెలుగుచూసిన క్లినికల్ ట్రయల్స్ పెద్ద దుమారం రేపుతోంది. స్వయంగా వైద్యఆరోగ్యశాఖ మంత్రి అయిన ఈటల రాజేందర్ మెడకు ఈ స్కాం చుట్టుకుంటోంది. ఆయన శాఖలో ఆయనకు తెలియకుండా ఇదంతా జరిగిందా.? లేక ఆయనను సాగనంపేందుకే టీఆర్ఎస్ లోని ఆయన వ్యతిరేక వర్గాలు ఈ స్కాంను వెలుగులోకి తీసుకొచ్చాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

కేసీఆర్ పై తిరుగుబాటు వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఈటెలకు పదవీ గండం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. డైరెక్ట్ గా ఆయనను తీసివేస్తే సీనియర్ ను తీసివేశారనే అపనింద రావచ్చు. అందుకే వ్యూహాత్మకంగానే ఆయనను సాగనంపేందుకు ఈ కుంభకోణాలు వెలికి తీస్తున్నారా అన్న చర్చ ఇప్పుడు రాజకీయాల్లో సాగుతోంది. ఏది ఏమైనా మంత్రి ఈటల రాజేందర్ ఎంతో కాలం గులాబీ పార్టీలో అధికారం చెలాయించలేడు అని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -