Wednesday, May 1, 2024
- Advertisement -

బిగ్ బాస్ 3 : పునర్నవి రాక.. రాహుల్ కేక..!

- Advertisement -

రాహుల్ కు ముందు నుంచి మంచి క్రేజ్ ఉంది. బిగ్ బాస్ హౌస్ లో మంచి గేమ్ ప్లే చేయడంలో రాహుల్ సక్సెస్ అయ్యాడు. పునర్నవి ఉన్నప్పుడు సరదాగా కనిపించే రాహుల్.. ఆమె వెళ్లిన తర్వాత కాస్త డీలా అయినప్పటికి గేమ్ లో మాత్రం తేడా లేకుండా దూసుకెళ్ళాడు. ఇప్పుడు మళ్లీ పునర్నవి హౌస్ లోకి రావడంతో రాహుల్ కు కొండంత బలం వచ్చినట్లు అయింది. రాహుల్ ఫైనల్ కు వెళ్లడమే కాకుండా.. మిగిలిన కంటెస్టెంట్లకు చెమటలు పట్టిస్తున్నాడు.

శ్రీముఖి, వరుణ్ టైటిల్ విన్నర్ అని జరిగిన ప్రచారాన్ని రాహుల్ పటాపంచలు చేశాడు. తన ఆట ఏంటో తాను ఆడుతూ ప్రేక్షకుల మనసును గెల్చుకున్నాడు. ఇక టైటిల్ విన్నర్ ని ప్రకటించేందుకు మరో కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో శ్రీముఖి నుంచి స్ట్రాంగ్ పోటీని ఎదుర్కొంటున్నాడు రాహుల్. ఫైనల్ లో భాగంగా ఎలిమినేట్ అయిన సభ్యులను తిరిగి హౌస్ లోకి తీసుకొచ్చాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ ను దారుణంగా తిట్టిన హేమ, హిమజతో పాటు తమన్నా, జాఫర్, శిల్పా, అషు, రవిక్రిష్ణ, శివజ్యోతి, పునర్నవి, వితికా అందరు హౌస్ లో సందండి చేశారు. అయితే అందరి ఎంట్రీ ఎలా ఉన్నప్పటికి పునర్నవి ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఎదురు చూశారు. ఆమె హౌస్ లోకి వస్తే రాహుల్ ఎలా ఫీల్ అవుతాడు అని చూశారు. ఎరుపు రంగు దుస్తుల్లో కలర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన పునర్నవి రాగానే శ్రీముఖి ఎత్తుకుని మరీ ఎక్కడో లోపల ఉన్న రాహుల్ దగ్గరకు తీసుకెళ్లి అతని ఒడిలోకి అందించింది.

పునర్నవిని అందుకున్న రాహుల్ ఆనందానికి అవధులు లేవు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి చేతిలో నుంచి పున్నూ రాహుల్ చేతులోకి వెళ్లాడాని హైలైట్ చేస్తూ.. ’శ్రీముఖీ.. పున్నూ నాదే, టైటిల్ కూడా నాదే” అంటూ ఫోటోనీ వైరల్ చేస్తున్నారు రాహుల్ ఫ్యాన్స్. మరి టైటిల్ ఎవరి సొంతం అవుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -