హీరోయిన్ రష్మీక ప్రస్తుతం టాలీవుడ్ లో వరస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఆమె నాగశౌర్య సరసన ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో గీతగోవిందం చేసి మరో సక్సెస్ ను అందుకుంది. దాంతో ఆమెకి వరస అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు, నితిన్ సరసన భీష్మా, అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో కూడా హీరోయిన్ గా ఈ భామనే నటిస్తోంది.
ఇక రాజమౌళి ప్రస్తుతం భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తున్నారు అనేది చాలా కాలంగా ప్రశ్నగా మారింది. అయితే ముందుగా ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఎడ్గార్ జోన్స్ ని ఎంపిక చేశారు. అయితే కొన్ని కారణాల చేత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది.
ఇక అప్పటి నుంచి మరో హీరోయిన్ వేటలో పడిపోయారు ఆర్ ఆర్ ఆర్ టీం. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఎన్టీఆర్ సరసన రష్మీక నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా పాత్రలో నటిస్తుండగా.. రామ్ చరణ్ అల్లురి పాత్రలో నటిస్తున్నాడు. చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.