జబర్దస్త్ నుంచి బయటకు రావడంపై నాగబాబు క్లారిటీ..!

జబర్దస్త్ లో ఎవరు ఉన్న నాగబాబు లేకుంటే జబర్దస్త్ బోరు కొడుతోంది. ఎందుకంటే ఆ నవ్వే జబర్దస్త్ కు అందం. జబర్దస్త్ షో బుల్లితెరపై ఎవరూ ఊహించని హిట్ అయింది. గత కొన్ని సంవత్సరాలు గా టాప్ రేటింగ్ తో జబర్దస్త్ కొనసాగుతోంది. ఈ జర్నీ మొత్తంలో నాగబాబు ఆయన ప్రస్థానం కొనసాగితున్న క్రమంలో సండెన్ గా ఫుల్ స్టాప్ పెట్టారు. జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

2013 నుంచి జబర్దస్త్ తో తన ప్రయాణం మొదలైందని, కానీ తనంతట తానే జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని అసలు ఊహించలేదని తెలిపారు. ప్రోగ్రామ్ బిజినెస్ కు సంబంధించిన కొన్ని భేదాభిప్రాయాల వల్ల బయటికి వచ్చేస్తున్నానని, ఇందులో ఎవరినీ తప్పుబట్టడంలేదని స్పష్టం చేశారు.

ఆర్థికంగా ఎంతో పతనమైన స్థితిలో జబర్దస్త్ లోకి వచ్చానని, ఈ కార్యక్రమం కోసం తానందుకున్న పారితోషికం ఎంతో ఉపయోగపడిందని వెల్లడించారు. అయితే పారితోషకం కారణంగా తేడా వచ్చి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చానని అనుకోవడం సరికాదని.. పూర్తి విషయాలు త్వరలోనే చెబుతానని తన యూట్యూబ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.