Tuesday, May 7, 2024
- Advertisement -

ఇలియానా బరువు పెరగడం వెనక సీక్రెట్ ఇదే..!

- Advertisement -

గోవ బ్యూటీ ఇలియా తన ఫేస్ కట్ తో కంటే తన నడుము, ఫిగర్ తోనే ఎక్కువ మంది అభిమానులను సంపాధించుకుంది. సన్నగా.. అందంగా ఇలియానా ఉంటుంది. అందుకే అమ్మాయిలు ఎక్కువ గా ఇలియానా లాగా ఉండటానికి ఇష్టపడుతారు. అయితే కొన్నాళ్లకు ఇలియానా బాగా లావు అయింది. ’అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానాను చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

అయితే ఆమె ఇంత తొందరగా లావు కావడానికి కారణం ఏంటో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇలియానా డిప్రెషన్ కు ఎక్కువ గురి అవుతుంటారు. ఇదే విషయం ఆమె చాలాసార్లు మీడియా ముందు చెప్పింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సన్నగా ఉన్న తన ఫిగర్‌ను చూసి ఎవరైనా కామెంట్ చేస్తారేమోనని చాలా బాధపడేదాన్నని తెలిపారు. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చేవని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆమె ట్రీట్‌మెంట్ తీసుకోవడం మొదలుపెట్టారు. అలా రోజుకు పన్నెండు ట్యాబ్లెట్స్ వేసుకుని నిద్రపోయేవారట. అందువల్ల తన శరీరంలో మార్పులు వచ్చి బరువు పెరిగిపోయానని తెలిపారు. ఆ తర్వాత ఆ బరువు తగ్గించుకోవడానికి జిమ్‌కు వెళ్లేదాన్నని, ఆ సమయంలో మీడియా చాలా ఫొటోలు తీసిందని పేర్కొన్నారు. ఆ ఫొటోలు బయటికి రావడంతో తనను సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేశారని ఇలియానా బాధపడింది. ఇప్పుడు మళ్లీ సన్నజాజిలా ఇలియానా మారిపోయింది.

దాంతో మళ్లీ ఆమెకు ఫాలోయింగ్ పెరిగింద్. బీచ్‌లో బికినీల్లో తన అందాలను ఆరబోస్తూ కుర్రాకారును పిచ్చేక్కిస్తోంది. బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూతో విడిపోయాక ఇలియానా తన పూర్తి ఫోకస్‌నను సినిమాలపైనే పెట్టింది. ప్రస్తుతం ఇలియానా.. ’పాగల్ పంతి’ అనే సినిమాలో నటిస్తోంది. తెలుగులోనూ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -