- Advertisement -

ఒక్క వికెట్ తో.. కుల్దీప్ ఖాతలో అరుదైన రికార్డ్..!

- Advertisement -

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన రికార్డ్ కి దగ్గరలో ఉన్నాడు. వైజాగ్ లో వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో హ్యాట్రిక్ వికెట్లు తీసిన కుల్దీప్.. కటక్ వేదికగా ఆదివారం జరగనున్న ఆఖరి వన్డేలో మరో వికెట్ పడగొడితే.. వన్డేల్లో 100 వికెట్లు తీసిన మైలురాయిని అందుకోనున్నాడు.

ఈ ఘనత సాధిస్తే 22వ టీమిండియా బౌలర్‌గా రికార్డు అతని ఖాయలో పడనుంది. ఇప్పటికే వన్డేల్లో రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ కుల్దిపే. కుల్దీప్ భారత జట్టులోకి 2017లో వచ్చాడు. ఇప్పటివరకు 54 మ్యాచ్‍లు ఆడిగిన కుల్దీప్ 99 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ కప్ తర్వాత కాస్త వెనకబడిన కుల్దీప్.. వైజాగ్ వన్డేతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. దీంతో కటక్ వన్డేలో ఒక వికెట్ పడగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే వన్డేల్లో 100 వికెట్ల పడగొట్టిన వారిలో టీమిండియా తరఫున హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, అశ్విన్, జడేజా ఉన్నారు. ఒకే ఒక్క వికెట్ కుల్దీప్ పడగొడితే ఈ జాబితాలో చెరిపోతాడు. భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సీరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు జరగగా.. సిరీస్ 1-1తో ప్రస్తుతం సమమైంది. మూడో వన్డే ఎవరు గెలిస్తే వారికి సీరీస్ సొంతం కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -