Friday, March 29, 2024
- Advertisement -

టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే ?

- Advertisement -

హైదరాబాద్ లో పుట్టిన హీరోయిన్ టబు తర్వాత ముంబైలో స్థిరపడింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన టబు.. ఆ తర్వాత హిందీ చిత్రాలతో మరింత బిజీ అయిపోయింది. 90వ దశకమంతా బాగా కలిసొచ్చింది టబుకు.. గ్లామర్ పాత్రలతోనూ, ఇటు నటనకు ప్రాధాన్యమున్న కథల్లోనూ నటిస్తూ టాప్ లోకి వెళ్లింది. మ్యాచిస్ సినిమాతో హిందీలో ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.

ఆ తర్వాత తమిళంలో కూడా నటించింది. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మంచి కెరీర్ ను బిల్డ్ చేసుకున్న టబు పెళ్లి మాత్రం చేసుకోలేదు. అందుకు కారణం ఆ హీరో అంటోంది టబు. ఆ హీరో ఎవరా ఆమెను ప్రశ్నించగా అజయ్ దేవగన్ అని చెప్పేసింది. తన సోదరుడికి అజయ్ బంధువు అవుతాడట. దాంతో చిన్నప్పటినుంచి అజయ్ తమతోనే ఉండేవాడు.

తామిద్దరం 25 ఏళ్లు స్నేహితులుగా ఉన్నాం. అజ‌య్ కార‌ణంగానే నేను పెళ్లి చేసుకోలేదు. అలాగ‌ని, పెళ్లి చేసుకోనందుకు నాకేం బాధ లేదు అని టబు చెబుతోంది. అయితే ఈ విషయాన్నీ ఎక్కడా తాను వ్యక్తపరచలేదని. కానీ ఎప్పుడైనా చెప్పక తప్పదనే ఉద్దేశంతో ఈ విషయం వెల్లడించానని టబు అంటోంది. సో దీన్ని బట్టి చూస్తే అజయ్ ని టబు పెళ్లి చేసుకుందాం అనుకుందేమో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -