- Advertisement -

ఎఫైర్ పై ఇన్నాళ్ళకు కామెంట్స్ చేసిన సమంత..!

- Advertisement -

ప్రతి మనిషి జీవితంలో కచ్చితంగా ఒక ప్రేమ విఫలం ఉంటుంది. వారు మనల్ని వదిలేయడమో.. లేక మనమె వారిని వదిలేయడమో.. తల్లిదండ్రులు ప్రేమికులను విడగొట్టడమో.. లేక ప్రేమికులు ఇద్దరూ చర్చించుకుని బ్రేకప్ పార్టీ చేసుకుని మరీ విడిపోవడమో జరిగి ఉంటుంది. సాధరణ వ్యక్తుల జీవితంలో ఇవి జరిగినట్లే సెలబ్రిటీల లైఫ్ లో కూడా ఇలాంటివి ఉంటాయి. స్టార్ హీరోయిన్ సమంత లైఫ్ లో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఈమధ్య సమంతా ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ టాగ్ సాధించింది.

ఈ సందర్బంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ లవర్ గురించి పరోక్షంగా కామెంట్స్ చేసింది. “మహానటి సావిత్రి వ్యక్తిగత జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొందో నా జీవితంలో కూడా అలాంటివే జరిగాయి. నేను ముందుగానే పసిగట్టడం తో ఆ బంధం నుంచి బయటపడ్డాను. తర్వాత చైతన్య లాంటి గొప్ప వ్యక్తి తో జీవితం పంచుకునే అవకాశం లభించింది” అంటూ మాజీ లవర్ పై ఓ బండ పడేసింది. అయితే చైతుతో పెళ్లికి ముందు.. సమంతా-సిద్ధార్థ్ ల లవ్ స్టోరీ అప్పట్లో హాట్ టాపిక్.

సమంతా ఎప్పుడూ ఆ విషయం గురించి ఒప్పుకోలేదు కానీ చైతన్య తో వివాహం జరిగిన తర్వాత సామ్ “నా జీవితం సావిత్రి లైఫ్ లాగా అయి ఉండేది” అంటే దానర్థం లవ్ లో ఉండేదాన్ని అని ఒప్పుకున్నట్టేనని నెటిజన్లు అంటున్నారు. ఇక పెళ్లికి ముమ్దు సమంత, సిద్దార్ధ్ లవ్ సంగతికి అందరికి తెలిసిందే. ఇప్పుడు ప్రత్యేకంగా అదంతా మాట్లాడి బయట పెట్టుకోవడం.. ఎక్కువ ప్రచారం కల్పించుకోవడం ఎందుకో మరి. ఇలాంటి టైంలో సిద్దార్థ్ కూడ కామెంట్ చేస్తే ఇది గొడవగా మారే ఛాన్స్ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -