టాలవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డె నటిస్తోంది. ఇక సినిమా పూర్తి అవ్వగానే సుకుమార్‌తో సినిమాను మొదలుపెడతాడు. తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం మహేశ్ అడివి శేష్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. వీరిద్దరు కలిసి ఓ సినిమా ప్లాన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటిస్తాడు. మరి మహేశ్ ఏం చేస్తాడనే కదా మీ అనుమానం. మహేశ్ బాబు ఈ సినిమాలో అసలు కనిపించడట.
ఈ సినిమాను మహేశ్ తన నిర్మాణ సంస్థలో నిర్మించనున్నాడు. గూఢచారి సినిమాతో తన టాలెంట్ ఏమిటో నిరుపించుకున్నాడు.ఇలాంటి హీరోని పైకి తీసుకురావలని ఆలోచలనలో భాగంగానే మహేశ్ అడవి శేష్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు మహేశ్. ఇక ఈ సినిమాకు గూఢచారి సినిమా డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తాడని సమాచారం.మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ ఈ యాక్షన్ థ్రిల్లర్ పూర్తి ప్రొడక్షన్ భాధ్యతలను వహించబోతున్నారు. ఈ సినిమా అతి త్వరలోనే ఎనౌన్స్ వచ్చే అవకాశం ఉంది.
- Advertisement -
అడివి శేష్ సినిమాలో మహేశ్ బాబు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -