Friday, May 10, 2024
- Advertisement -

అర్జున్‌రెడ్డికి వ‌రంగ‌ల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడ‌ట‌!

- Advertisement -

చేసిన సినిమాలు రెండు, మూడే కానీ స్టార్ హీరో క్రేజీ వ‌చ్చేసింది విజయ్ దేవ‌ర‌కొండ‌కు. మొద‌ట రెండు సినిమాల్లో ప‌లు పాత్ర‌ల్లో మెరిసిన అత‌డికి పెళ్లిచూపులు సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ నిలిచింది. ఆ త‌ర్వాత ద్వార‌క సోసో ఆడినా అర్జున్‌రెడ్డి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సంచ‌ల‌న విజ‌యంగా నిలిచింది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ఈ సినిమాకు వ‌చ్చాయి.

ఈ సినిమాల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ హోదా పొందిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇప్పుడు విజ‌య్‌కు విప‌రీత‌మైన క్రేజీ ఏర్ప‌డింది. ఇటీవ‌ల వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించిన స‌మ‌యంలో అభిమానులు పోటెత్తారు. ఓ షోరూమ్ ప్రారంభించిన అనంత‌రం విజ‌య్ మాట్లాడారు. ఈ స‌మ‌యంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను వ‌రంగ‌ల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. తన సోదరుడు వరంగల్‌ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండ‌డంపై ఆనందం వ్య‌క్తం చేశాడు. ఇక తాను త‌న అన్న మాదిరి వరంగల్‌ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో వ‌రంగ‌ల్‌వాసులు ఫిదా అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -