అవును అఖిల్ వల్ల నితిన్ కోర్టు మెట్లు ఎక్కించాడు.అఖిల్ వల్ల అంటే అఖిల్ సినిమా గురించి నితిన్ కోర్టుకు హాజరైయాడు.విషయం ఏమిటంటే అఖిల్ మొదటి సినిమాకు నితిన్ నిర్మాతగా వ్యవహరించాడు.ఆ సినిమా నితిన్‌ను తీవ్ర నష్టలతో పాటు కోర్టుపాలు కూడా చేసింది. ఈ సినిమా విషయంలో తనవద్ద రూ.50 లక్షలు తీసుకుని, హక్కులు ఇవ్వకుండా తనను మోసం చేశారంటూ సికింద్రాబాద్ సైనిక్‌పురికి చెందిన గంగాధర సత్యనారాయణ అనే వ్యక్తి మల్కాజ్‌గిరి, సైబరాబాద్ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ 20వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో గతేడాది సెప్టెంబర్ 23న ఫిర్యాదు చేశారు.
నితిన్, నిఖితను మూడో, నాల్గో నిందితులుగా పేర్కొన్నారు. నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్‌రెడ్డిని రెండో నిందితునిగా, శ్రేష్ట్ మూవీస్‌ను మొదటి నిందితునిగా చేర్చారు. వారందరికీ కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిపై నితిన్, నిఖితారెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రేష్ట మూవీస్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సత్యనారాయణ తన ఫిర్యాదులో నితిన్, నిఖితారెడ్డిలను శ్రేష్ట మూవీస్ సంస్థలో భాగస్వాములంటూ తప్పుగా పేర్కొని వారిపైనా కేసు పెట్టారని, అందులో వారు భాగస్వాములు కాదని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనను హైకోర్టు ఆమోదించి కేసును కొట్టివేసింది.