ఈ సంక్రాంతి తెలుగులో చాలానే సినిమాలు విడుదల అవుతున్న , ఫ్యామిలీ ఆడియోన్స్ మాత్రం ఆ ఒక్క సినిమా కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమానే ఎఫ్2 . ఈ సంక్రాంతి విడుదల అవుతున్న సినిమాలలో ఎఫ్2 ఒకటి. వెంకీ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ట్రైలర్ మొత్తం కమెడీతో నింపేశాడు దర్శకుడు. ఇక్కడ వరకు బాగానే ఉంది కాని ట్రైలర్‌లో హీరోయిన్స్‌ను బికినిలతో చూపించి రచ్చ చేశాడు దర్శకుడు.
ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు తమన్నా,మెహ్రీన్. వీరి చేత బికినిలు వేయించాడు చిత్ర దర్శకుడు. ట్రైలర్‌లో వీరిద్దరు బికినిలు వేసుకుని నడిచి వస్తోన్న సీన్ ట్రైలర్‌లో బాగా హైలెట్ అయింది. కంప్లీట్ ఫామిలీ ఎంటర్ టైనర్ గా చెప్పుకుంటూ వస్తున్న సినిమాలో ఇలాంటి బికినీ సీన్లు చూపించడం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి బికిని సీన్లు వచ్చినప్పుడు ఫ్యామిలీ ఆడియోన్స్ ఇబ్బంది పడటం ఖాయం. మరి ఇలాంటి సీన్లు ఎవరి కోసం అంటే,మాస్ ప్రేక్షకుల కోసమే అని అంటున్నారు సినీ విశ్లేషకులు.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ