మెగా, నందమూరి వివాదం ఇప్పట్లో ముగిసేలాలేదు. మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు…బాలకృష్ణ ఎవరో నాకు తెలియదని చెప్పి ఈ వివాదానికి తెర లేపారు. అంతకు ముందు బాలకృష్ణ మీడియా అడిగిన ప్రశ్నకు పవన్ ఎవరో నాకు తెలియదని చెప్పారు. తన పార్టీకి అండగా నిలిచి ,పార్టీని అధికారంలోకి రావడానికి సహాయపడిన వ్యక్తిని నాకు ఎవరో తెలియదని చెప్పడం దారుణం అని ,దీనికి బదులుగానే నాగబాబు ఇలా బాలయ్య ఎవరో నాకు తెలియదని చెప్పారని మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ వివాదం జరిగిన రెండు రోజులు తరువాత నాగబాబు మరోసారి తన ఫేస్‌బుక్‌లో ఓ వీడియోని పోస్ట్ చేస్తు ..క్షమించండి బాలయ్య ఎవరో నాకు తెలియదని చెప్పాను, ఆయన నాకు తెలుసు, గొప్ప నటుడు, ఎన్టీఆర్, కృష్ణలతో కలిసి నటించిన ఆయన తెలియదని చెప్పడం నిజంగా తప్పే , ఇండస్ట్రీలో ఆయన అంత గొప్ప కమెడియన్ మరోకరు లేరంటూ మరోసారి బాలయ్యను కించపరిచేలా మాట్లాడారు. దీంతో సోషల్ మీడియా వేదికగా మెగా ,నందమూరి ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన అంతరిక్షం సినిమా విడుదలవుతుంది.దీంతో ఈ సినిమాను టార్గెట్ చేశారు నందమూరి ఫ్యాన్స్. ఈ సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తామని తెలిపారు బాలయ్య ఫ్యాన్స్. ఈ గొడవ అటు తిరిగి ఇటు తిరిగి తనవైపు వచ్చిందని భావించిన వరుణ్ తేజ్ ,తాజాగా ఈ వివాదంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
తన తండ్రి నాగబాబు.. బాలకృష్ణపై అటువంటి కామెంట్స్ ఎందుకు చేశారో వివరిస్తూ.. ”బాలకృష్ణ గారి గురించి నాన్న చేసిన కామెంట్స్ ని నేను అర్ధం చేసుకోగలను. ఎందుకంటే పవన్ బాబాయ్ గురించి బాలయ్య గారు కూడా కొన్ని కామెంట్లు చేశారు. తమ్ముడి గురించి తప్పుగా మాట్లాడాడం నాన్నగారికి నచ్చలేదు. ఆయన హర్ట్ అయ్యాడు. దీంతో ఆయన కూడా అలాగే రియాక్ట్ అయ్యారు” అంటూ చెప్పుకొచ్చాడు. తన సినిమా విడుదల ఉంది కాబట్టి వరుణ్ ఇలా వివరణ ఇచ్చాడు ,కాని లేకపోతే వరుణ్ ఎందుకు స్పందిస్తాడని మెగా అభిమానులు అంటున్నారు. ఇక బాలయ్య అభిమానులు అయితే మాకు బాగానే భయపడ్డారని అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!