తెలుగు హాట్ యాంకర్స్‌లో యాంకర్ రష్మి ఒకరు. అందం ,అభినయం రెండు రష్మి సొంతం. అందుకే ఆమెకు హీరోయిన్లకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. పలు టీవీ షోలకు యాంకరింగ్ చేస్తు చాలామంది అభిమానులను సంపాదించుకుంది. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తు అందాల కనువిందు చేస్తోంది. రష్మి చాలా సెన్స్‌టివ్ అని చాలామందికి తెలుసు. తాజాగా తన మనస్సు ఎలాంటిదో చెప్పే సంఘటన ఒకటి జరిగింది. రష్మి షూటింగ్‌కు వెళ్తుండగా అక్కడ బయట ఒక కుక్కపిల్లని చూసిందట. ఆ కుక్కపిల్లకు తీవ్ర గాయాలు కావడం చూసిన రష్మి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ కుక్కపిల్లకు వైద్యం కావాలని కాని ఎవరు పట్టించుకోవడం లేదంటు ట్విట్ చేసింది రష్మి.
నేను షూటింగ్‌లో ఉండటం వల్ల దానికి వైద్యం అందించలేకపోతున్నా, దయచేసి ఎవరైన సాయం చేయండి అంటూ ట్విట్ చేసింది. కొద్దిసేపటికి ఆ పప్పీని తాను హాస్పిటల్ కి తీసుకెళుతున్నట్లు చెప్పింది. దీనికి తీవ్ర గాయాలు అయినట్లుగా ఉన్నాయి. వైద్యం అందిస్తే కోలుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. వైద్యం తరువాత దీనిని రెస్క్యూ హోం తరలిస్తానని , దయచేసి రెస్క్యూ హోం ఫోన్ నెంబర్ ఉంటే తెలియజేయాలని కోరింది. ఈ ఘటన చూసిన వారందరికి రష్మిది ఎంత మంచి మనస్సు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
- Advertisement -
యాంకర్ రష్మిది ఎంత మంచి మనస్సు..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -