మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన అంతరిక్షం మూవీ నిన్ననే(శుక్రవారం) విడుదలైంది. ఘాజీ మూవీకి దర్శకత్వం వహించిన సంకల్ప్ రెడ్డి అంతరిక్షం సినిమా కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలకు మించి ఉండడంతో సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని భావించారు. కానీ ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
యావరేజ్ టాక్ తో సరిపెట్టుకోవాల్సివచ్చింది.దానికి తగ్గట్లే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. నిజానికి సినిమాపై ఉన్న క్రేజ్ తో ఓపెనింగ్స్ భారీగా వస్తాయని ఆశించిన చిత్రబృందానికి షాక్ తగిలింది. నిన్న చాలా సినిమాలు విడుదల కావడంతో ఆ ప్రభావం ఈ సినిమాపై పడింది. అంతరిక్షం కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.
ఏరియాల వారీగా కలెక్షన్లు..
నైజాం – 0.49 కోట్లు
సీడెడ్ 0.18 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.18 కోట్లు
గుంటూరు – 0.16 కోట్లు
ఈస్ట్ – 0.07 కోట్లు
వెస్ట్ – 0.05 కోట్లు
కృష్ణ – 0.07 కోట్లు
నెల్లూరు – 0.04 కోట్లు
ఆంధ్ర – 1.24 కోట్లు
ఈ సినిమా మొదటిరోజు కేవలం రూ.2 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది.
- Advertisement -
వరుణ్ తేజ్‌కు షాకిచ్చిన ‘అంతరిక్షం’ ఫస్ట్ డే కలెక్షన్లు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -