- Advertisement -
టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో అల్లు అర్జున్ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఏ-11గా ఉన్న ఆయనను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంచలనం కోసమే అరెస్ట్ చేశారని…అర్జున్‌కు బెయిల్ ఇస్తే సహకరిస్తారని చెప్పారు.
