తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ,స్టార్ డైరెక్టర్ కాంబినేషన్‌లో వచ్చిన 2.O సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికి వాటిని తట్టుకుని విజయం సాధించింది 2.O .భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకున్న ఈ సినిమా, అదే జోరును కొనసాగిస్తూ మూడు వెర్షన్స్ లోను 100 కోట్ల గ్రాస్ ను సాధించిన రికార్డును సొంతం చేసుకుంది.తాజగా ఈ సినిమా 700 కోట్ల క్లబ్‌లో చేరినట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
నిన్నటితో 15 రోజులను పూర్తిచేసుకున్న ఈ సినిమా 700 కోట్ల మార్కును చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా తొలివారంలో 526.86 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా, రెండవ వారం పూర్తయ్యేనాటికి 710.98 కోట్లను రాబట్టిందని తమిళ సినిమా ట్రేడ్ అనలిస్ట్ మనోబాల తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.రజినీ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ
- వైసీపీ నేత కేతిరెడ్డికి హైకోర్టులో ఊరట
- శ్రీవిష్ణు..వివాదానికి ఎండ్ కార్డు పడేనా?
- నగదు విత్ డ్రా చేస్తున్నారా…అయితే?