Tuesday, April 30, 2024
- Advertisement -

కన్నప్పలో బాలీవుడ్ హీరో!

- Advertisement -

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఇటీవలె న్యూజిలాండ్‌లో రెండో షెడ్యూల్ పూర్తికాగా త్వరలోనే మూడో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇక ఇటీవలె మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1ని లాంచ్ చేయగా ఇది భక్త కన్నప్ప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది.

ఇక ప్రెస్టేజియస్ ప్రాజెక్టులో ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, మోహన్ బాబు, బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శ్రీకాళహస్తి, కన్నప్ప చరిత్ర కథాంశంతో దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో మోహన్ బాబు తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతోంది. వివిధ భాషలకు చెందిన నటులు కన్నప్పలో భాగమవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -