Tuesday, May 7, 2024
- Advertisement -

90 ఎంఎల్ ఫస్ట్ లుక్: మందు సీసాల పైన కార్తికేయ

- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’ వంటి బోల్డ్ సినిమాతో హీరో కార్తికేయ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. కానీ తన తదుపరి సినిమా అయిన ‘హిప్పీ’ తో మాత్రం మంచి హిట్ ని అందుకోలేకపోయాడు కార్తికేయ. రొమాంటిక్ ప్రేమ కథ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా ఇప్పుడు కార్తికేయ కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి తో చేతులు కలిపి ఒక ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమాకి ’90 ఎం ఎల్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేసారు దర్శక నిర్మాతలు. టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే టైటిల్ కు తగ్గట్టుగానే సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉండబోతోందని అర్థమవుతుంది. కార్తికేయ ఈ సినిమాలో ఒక సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఫస్ట్ లుక్ లో నే మందు బాటిళ్ల పై పడుకొని ఒక ఆసక్తి ని క్రియేట్ చేసిన కార్తికేయ ఈ సినిమా తో ఏం చూపిస్తాడా అనేది కుతూహలం గా మారుతుంది.

‘హిప్పీ’ వంటి డిజాస్టర్ తర్వాత తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు ఈ యువ హీరో. మరి హిట్టు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న కార్తికేయ కి కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి ఎంతవరకు మంచి విజయాన్ని అందిస్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -