Monday, May 6, 2024
- Advertisement -

సెట్స్ మీద గాయపడ్డ యువ హీరో

- Advertisement -

సుధీర్ బాబు తెలుగు సినిమా పరిశ్రమ లో మంచి ఫిజిక్ మైంటైన్ చేస్తున్న హీరోల్లో ఒకరు. ఆయన ప్రతి సినిమా కి బాగా కష్టపడుతూ ఎంతో కొంత కొత్తదనాన్ని ప్రేక్షకులకి అందించాలి అని నిరంతరం తపన పడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన సినిమా షూటింగ్ లో గాయపడిన వార్త ఒకటి మనకి తెలుస్తుంది. వీ సినిమా షూటింగ్ కోసం ఆయన గాయపడ్డ సంగతి ఆయనే చెప్పారు.

“వీ సినిమా కోసం ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొనడం జరిగింది. ఈ షూటింగ్ సమయం లో ఇలా జరిగింది. పోరాట సన్నివేశాలు చేసేప్పుడు ఉండే ఆ జంపింగ్స్ అన్నీ చాల బాగుంటాయి. కొన్ని మధురానుభూతులుగా మిగిలి పోతూ ఉంటాయి. మోహన్ కృష్ణ ఇంద్రగంటి లాంటి దర్శకుడు చేసే సినిమా నుంచి ఇలాంటివి ఆశించడం కొంత విశేషమే అని చెప్పుకోవాలి.” అని సుధీర్ బాబు దెబ్బ తగిలిన ఫోటోలు సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు.

ఈ సినిమా లో సుధీర్ బాబు తో పాటు నాని కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా లో నివేతా థామస్ తో పాటు అదితి రావ్ హైదరి కూడా నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -