తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అతను నటించిన సినిమాలు అన్ని తెలుగులో కూడా విడుదల అవుతుంటాయి. సూర్య హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిసిన విషయమే. జ్యోతిక పిల్లలు, కుటుంబం కోసం సినిమాలకు కొంతకాలం దూరం అయింది. ఆమె ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి సినిమాలలో నటిస్తున్నా సంగతి తెలిసిందే.
తాజాగా వదిన జ్యోతికతో కలిసి సూర్య తమ్ముడు హీరో కార్తి ఓ సినిమాలో నటించనున్నాడు. మళయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ జ్యోతిక ప్రధాన ప్రధాన పాత్రలో ఓ సినిమాకు ప్లాన్ చేశాడు. ఈసినిమాలో ఓ కీలక పాత్ర కోసం కార్తిని సంప్రదించాడ దర్శకుడు. కథ నచ్చడంతో వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట కార్తి. త్వరలోనే సినిమా షూటింగ్ మొదలుకానుంది. జీతూ జోసెఫ్‌కు దర్శకుడిగా మంచి పేరుంది. గతంలో మనోడు దృశ్యం సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అన్ని భాషలలో విడుదల అయి ఘన విజయం సాధించింది.
- Advertisement -
వదినతో కలిసి సినిమాలో నటిస్తున్న హీరో కార్తి
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -