Sunday, May 19, 2024
- Advertisement -

సన్‌రైజర్స్ ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టం!

- Advertisement -

ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి. ముంబైతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలైంది హైదరాబాద్. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 173 పరుగులు చేసింది. 174 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ముంబై 17.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఓపెనర్లు రోహిత్, ఇషాన్ కిషన్ ఇద్దరు విఫలమైన తర్వాత వచ్చిన సూర్య, తిలక్ వర్మ మరో వికెట్ పడకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా సూర్యకుమార్‌ యాదవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 51 బంతుల్లో 6 సిక్స్‌లు,12 ఫోర్లతో 102 నాటౌట్‌గా నిలవగా తిలక్‌ వర్మ 32 బంతుల్లో 37 నాటౌట్‌గా నిలిచారు.

తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఆరంభంలోనే తడబడింది. ఒక దశలో కీలక వికెట్లు కొల్పోగా మరోవైపు ట్రావిస్‌ హెడ్‌ 30 బంతుల్లో 48 పరుగులు చేయగా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ 17 బంతుల్లో 35 నాటౌట్‌గా నిలిచారు. సూర్యకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ ఓటమితో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -