Wednesday, May 15, 2024
- Advertisement -

నటుడు సుబ్బరాజు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే ?

- Advertisement -

ప్రతి మనిషి తన లైఫ్ లో ఓ విలువైన మనిషి ఉంటే చాలు అనుకుంటారు. అందుకే పెద్దలు పెళ్లి చేసుకోమంటారు. పెళ్లి వల్ల ఒకరికి ఒకరు తోడు ఉంటారు అని.. బాధలు కష్టాలు పంచుకోవచ్చని చెబుతారు. అయితే దీనిపై కొందరు పాజిటివ్ గా ఉంటే మరికొందరు అంతగా పట్టించుకోరు. ఎవరెన్ని చెప్పినా కొందరుకి మాత్రం పెళ్లిపై కాస్త భిన్న అభిప్రాయాలు ఉంటాయి.

ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ యాక్టర్ సుబ్బరాజు తాను ఇప్పటిదాకా పెళ్లెందుకు చేసుకోలేదనే విషయంపై స్పందించాడు. తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుబ్బరాజు. విలన్ గా కూడా చేశాడు. అంతేకాకుండా తనలో ఉన్న కమెడియన్ ను బయటకు తీసి ప్రేక్షకులను నవ్వించాడు. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన శైలి ఉన్న ఆర్టిస్టుగా క్రెడిట్ కొట్టేశారాయన. బాహుబలి సినిమాతో ఆయన క్రేజ్ చాలా పెరిగిపోయింది. అయితే ఆయన నిజ జీవితం విషయానికొస్తే అందరికీ తెలియని నిజం ఒకటుంది.

43 ఏళ్ల వయసున్నా ఇంకా పెళ్లి మాత్రం చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉన్నాడు సుబ్బరాజు. ఈ క్రమంలో తాజా ఇంటర్వ్యూలో తన పెళ్లిపై స్పందించిన సుబ్బరాజు.. పెళ్లి చేసుకోవాలంటే కేవలం వయసు మాత్రమే ఆధారం కాదని అన్నాడు. ఏదో నాకు 25 ఏళ్ళు వచ్చాయి కాబట్టి పెళ్లి చేసుకోవాలి లేదా అందరూ చేసుకుంటున్నారు కాబట్టి నేను చేసుకోవాలని అనుకోవడం కరెక్ట్ కాదనేది తన అభిప్రాయమని చెప్పాడు. జీవిత భాగస్వామికి తాను బెస్ట్ ఇవ్వగలను, ఏ లోటు రాకుండా చేసుకోగలను అని అనిపించినప్పుడే పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. ఇక ప్రస్తుతం సుబ్బరాజు.. ’ నిశ్శబ్దం’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అనుష్క, మాధవన్ ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా.. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. లాక్ డౌన్ అయిపోగానే ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -