Monday, May 6, 2024
- Advertisement -

ఓవర్ కాన్ఫిడెన్స్ తో దెబ్బతిన్న ముగ్గురు హీరోలు

- Advertisement -

కొందరు తమ సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం తమ సినిమా గురించి ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా తమ సినిమాల గురించి ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడిన ముగ్గురు హీరోలు డిజాస్టర్ ను అందుకున్నారు. అందులో మొదటగా చెప్పాల్సింది విశ్వక్ సేన్ గురించి. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ‘ఫలక్నుమ దాస్’ సినిమాతో దర్శకుడిగా కూడా మారాడు. ఒకవైపు థియేటర్లో ప్రేక్షకుల నుంచి సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని ఎంతగా చెబుతున్నా కలెక్షన్ల పరంగా చూస్తే మాత్రం ఈ సినిమా ఫ్లాప్ అని చెప్పుకోవాలి.

మరోవైపు ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తికేయ ‘హిప్పీ’ అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. మొదటి సినిమాలో లవ్ ఫెయిల్యూర్ గా కనిపించిన కార్తికేయ ఈ సినిమాలో ప్లే బాయ్ గా బాగానే నటించాడు కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. మరోవైపు హవీష్ ‘సెవెన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా ప్రమోషన్ల కోసం చిత్రబృందం తిరగని చోటు లేదు. ఇంటర్వ్యూ లు, ప్రెస్ మీట్ లు అంటూ సినిమాని ఆకాశానికి ఎత్తేసారు కానీ కలెక్షన్లు మాత్రం కొంచెం కూడా పైకి రావడం లేదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -