Sunday, May 19, 2024
- Advertisement -

హీఓయిన్ అసిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

- Advertisement -

హీరోయిన్ అసిన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మలయాళం మూవీ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అసిన్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ లాంగ్వేజ్స్ లో సూపర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా తెలుగులో గజిని, చక్రం, శివమణి, అన్నవరం, అమ్మనాన్న ఓ తమిళమ్మాయి, ఘర్షణ, దశవతారం వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది.

అగ్ర హీరోలందరితో నటించి నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అసిన్ పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా గుడ్బై చెప్పేసింది. 2016లో అసిన్ కి వివాహం జరిగింది. అసిన్ భర్త పేరు రాహుల్ శర్మ. ఆయన మైక్రో మాక్స్ కంపెనీ అధినేత. వీరిద్దరిది ప్రేమ వివాహం. వీరి పెళ్లి హిందూ మరియు క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో అంగరంగ వైభవంగా జరిగింది.

అసిన్, రాహుల్ శర్మలకు ఒక కూతురు. పాప పేరు అరిన్. సినిమాలకు గుడ్ బై చెప్పేసిన తర్వాత అసిన్ బయట ఎక్కడా కనిపించలేదు. పాప అరిన్ ను కూడా ఫస్ట్ బర్త్ డే రోజున అభిమానులకు పరిచయం చేసింది అసిన్. కానీ ఆమె భర్త రాహుల్ శర్మ మాత్రం అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -