Friday, May 17, 2024
- Advertisement -

అవకాశం ఇవ్వండి అంటూ బోరున ఏడ్చిన హీరోయిన్..!

- Advertisement -

చేతిలో సినిమాలు లేకపోతే ఏ హీరోయిన్ కూడా సరిగ్గా నిద్రపోలేదు. అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అవకాశాలు రావడం లేదని చెప్పే హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. తనకు తగిన పాత్రలు రావడం లేదని.. అందుకే సినిమాలు చేయడం లేదని చెప్పే హీరోయిన్సే ఎక్కువ మంది ఉంటారు.

కానీ ప్రముఖ నటి శాన్వి శ్రీవాస్తవ మాత్రం ఉన్నది ఉన్నట్లు చెప్పేసింది. తెలుగులో ‘లవ్లీ’, ‘రౌడీ’, ‘అడ్డా’ తదితర సినిమాల్లో నటించిన శాన్వికి ఒక్క హిట్టు కూడా పడలేదు. ఆ తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు రావడమే తగ్గిపోయాయి. దాంతో దాదాపు ఏడాదిన్నర పాటు ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో శాన్వికి అదృష్టం తలుపు తట్టింది. కన్నడ నుంచి పిలుపు వచ్చింది.

కిరిక్ పార్టీ సినిమాతో మంచి విజయం అందుకున్న రక్షిత్ శెట్టి జోడీగా నటించే అవకాశం వచ్చింది. అదే ‘అవనే శ్రీమన్నారయణ’ సినిమా. దీనిని తెలుగులో ‘అతడే శ్రీమన్నారాయణ’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఫ్యాంటసీ అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కించిన ఈ సినిమాకు సచిన్ రవి డైరెక్ట్ చేశారు. బుధవారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా శాన్వి మాట్లాడుతూ స్టేజ్‌పై ఏడ్చేశారు.

“నాది చిన్న వయసనో.. లేక సరిగ్గా నటించననో.. లేక అందంగా లేననో తెలియదు కానీ నాకు ’రౌడీ’ సినిమా తర్వాత తెలుగులో ఛాన్సులు రాలేదు. దాదాపు ఏదాదిన్నర పాటు సినిమాలు లేక ఖాళీగా ఉన్నాను. ఎన్నో రాత్రుళ్లు ఏడ్చాను. కానీ నాకు ’అతడే శ్రీమన్నారయణ’ ద్వారా తెలుగు ప్రేక్షకులను మళ్లీ పలకరించే ఛాన్స్ వచ్చింది. తెలుగులో నాకు ఛాన్స్ రాకపోవడంతో నాలో కాన్పిడెన్స్ పోయింది. కనీసం ఈ సినిమా ద్వారానైన తెలుగు వారు నాలోని టాలెంట్ ను గుర్తించి నాకు ఛాన్స్ ఇస్తారని ఎదురుచూస్తున్నా” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది హీరోయిన్ శాన్వి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -