Saturday, April 27, 2024
- Advertisement -

24 ఏళ్లకే గుండెపోటు…యువనటి మృతి

- Advertisement -

మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. గుండెపోటుతో యువనటి లక్ష్మి్ మృతి చెందింది. ఆమె వయస్సు 24. ఓ వైపు సినీ రంగం మరోవైపు షార్జాలో బ్యాంకింగ్ రంగంలో తనదైన ముద్రవేశారు లక్ష్మీక. ప్రస్తుతం షార్జాలో ఉన్న ఆమె సడన్‌గా గుండెపోటు రావడంతో కుప్పకూలారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది.

అట్టడుగు వర్గాల పోరాటాలను వెలుగులోకి తెచ్చిన అత్యంత ప్రశంసలు పొందిన టెలిఫిల్మ్ ‘కాక్క’. ఈసినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. దుల్కర్ సల్మాన్ తో చాలా సినిమాల్లో నటించారు.

ప్రశాంత్ బి మొలికల్ దర్శకత్వంలో లక్ష్మిక న‌టించిన‌ థ్రిల్లర్ కూన్ రీసెంట్‌గా విడుదలై మంచి సక్సెస్ సాధించింది. అలాగే విజీష్ దర్శకత్వంలో వచ్చిన పూజయమ్మలో కూడా ఆకట్టుకుంది. కనీసం పాతికేళ్లయిన నిండకుండానే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లడం మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -