- Advertisement -

మంచు విష్ణుపై మీనా ప్రశంసలు..ఎందుకో తెలుసా?

- Advertisement -

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుపై ప్రశంసలు గుప్పించారు సీనియర్ నటి మీనా. సినీనటులపై అసభ్యకరమైన వార్తలను ప్రచారం చేస్తున్న యూ ట్యూబ్ ఛానల్స్‌పై చర్యలు తీసుకుంటున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. విష్ణు చొరవతో 18 యూ ట్యూబ్ ఛానల్స్‌పై వేటు పడింది. ఇక అప్పటి నుండి నటులపై ట్రోల్స్ తగ్గుముఖం పట్టగా తాజాగా మీనా స్పందించారు.

తప్పుడు వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకున్న విష్ణుకు ధన్యవాదాలు అని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సినిమా ఇండస్ట్రీ సమగ్రత కోసం మీరు చూపుతున్న అంకిత భావం చాలా గొప్పదని, నెగెటివ్ కామెంట్స్ ను, ట్రోలింగ్ ను ఎదుర్కొంటూ నిత్యం నటులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఇలాంటి ఎన్నో మంచి నిర్ణయాలు భవిష్యత్ లో తీసుకుంటారని ఆశిస్తున్నాను అని తెలిపారు మీనా.

గతంలో మీనాపై కూడా కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేశాయి. భర్త చనిపోయి దు:ఖంలో ఉన్న మీనాపై రెండో పెళ్లి చేసుకోబోతుందని, హీరో ధనుష్‌తో ఎఫైర్ నడుపుతుందని ప్రచారం చేశారు. ఈ వార్తలతో మీనా ఫ్యామిలీ మరింత కుంగిపోయింది. తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని చెప్పిన కొన్ని యూ ట్యూబ్ ఛానళ్లు నెగటివ్ ప్రచారాన్ని ఆపలేదు. ఈ నేపథ్యంలోనే విష్ణు తీసుకున్న నిర్ణయంపై స్పందించారు మీనా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -