Monday, April 29, 2024
- Advertisement -

బద్రి టైంలో చాలా కేర్ తీసుకున్నారు.. మర్చిపోలేను : రేణూ దేశాయ్‌

- Advertisement -

పవన్‌తో చేసిన ‘బద్రి’, ‘జానీ’ చిత్రాలు తన జీవితంలో మర్చిపోలేని అనుభూతులని రేణు దేశాయ్ అన్నారు. ఈ సినిమాల గురించి ఆమె మాట్లాడుతూ.. పవన్ తో జానీ మూవీ ఎక్స్ పీరియన్స్ నా జీవితంలో మర్చిపోలేనిది. ఈ సినిమాలో హీరోయిన్ గా.. ప్రొడక్షన్ డిజైనర్ గా.. ప్రొడక్షన్ అసిస్టెంట్ గా.. ఎడిటింగ్ ఇలా చాలా విభాగాల్లో పని చేశా.

అప్పుడు నా వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. ఈ సినిమా కోసం 16-17 గంటలు పనిచేశా.. నాలో అంత కెపాసిటీ ఉందా అని ఆ సినిమాతో తెలిసింది. కష్టపడకుండా ఏదీ రాదని తెలిసింది ఆ చిత్రంతోనే. అలానే బద్రి సినిమా కూడా నా లైఫ్‌లో మంచి ఎక్స్ పీరియన్స్. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరితో మంచి అనుభందం ఉంది. ఒక సినిమాకి 50-60రోజులు వరుసగా పనిచేస్తే ఇబ్బందులు వస్తుంటాయి. వసతులు సరిగా ఉండకపోవడం.. ప్రొడక్షన్ టీం, ఇతర టీంలతో సమస్యలు ఉంటాయి.

కాని.. బద్రి సినిమాకి జీరో కంప్లైంట్స్. ఒక్క రోజు కూడా నేను ఇబ్బందిగా ఫీల్ కాలేదు. 18 ఏళ్లు వయసులో నాకు బద్రి లొకేషన్ స్పాట్ చాలా సేఫ్‌గా అనిపించేది. నేను చాలా దూరం నుంచి వచ్చిననే ఫీలింగ్ లేకుండా చాలా కేరింగ్‌గా చూసుకునేవారు’ అంటూ పవన్ కళ్యాణ్‌తో చేసిన జానీ, బద్రి మూవీ విశేషాలను పంచుకున్నారు రేణు దేశాయ్. ఇక రేణూ దేశాయ్.. ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం వంటి సినిమాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా వర్క్ చేశారు.

శ్రీముఖి, విష్ణుప్రియతో గొడవపై స్పందించిన వర్షిణి..!

అన్నయ్య మూవీతో ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ చెల్లి..!

ఐశ్వర్య ఆరాధ్యల ఆరోగ్య ప్రస్తుతం ఏలా ఉంది.. వాళ్లు ఎక్కడ ఉన్నారు ?

నిర్మాత దిల్ రాజు కుమార్తె ఎమోషనల్ పోస్ట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -