Sunday, May 5, 2024
- Advertisement -

తాగి.. టీవీ షోలో రచ్చరచ్చ చేసిన ఊర్వశి

- Advertisement -

తెలుగు సినిమాల్లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది ఊర్వశి. తెలుగు పాటలకు చిందులేసిన ఈమె.. ఈ సారి తాగి చిందులేస్తూ వార్తల్లోకెక్కుతోంది. ఎల్.డి.ఎఫ్ ఆర్గనైజ్ చేసిన ఫీమేల్ లేగిస్లేటివ్ స్టాఫ్ కమీషన్ మీటింగ్ కి ఊర్వశి హాజరు కావాలి. ఈమె ఈ కార్యక్రమానికి ఆలస్యంగా రావడమే కాకుండా, స్టేజ్ మీదకి కూడా తూగుతూ, తూలుతూ వెళ్ళింది. అంతే కాకుండా స్టేజ్ మీద మాట్లాడడం కూడా సరిగా లేదు. తనకి నోటికి ఏదొస్తే అది మాట్లాడేసింది. దాంతో ఆ మీటింగ్ మొత్తం డిస్టర్బ్ అయ్యింది. అయితే ఊర్వశి.. ఇలా మందు తాగి.. మత్తుల్లో ఇలా బిహేవ్ చేయడం ఇదేం ఫస్ట్ టైం కాదు. గతంలో తన విడాకుల కేసు హియరింగ్ కి ఎర్నాకులంలోని ఫ్యామిలీ కోర్టుకు కూడా తాగి వచ్చింది. ఊర్వశి మలయాళం లో జీవితం సాక్షి అనే ప్రోగ్రాం కు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. . మన తెలుగులో కూడా భార్య,భర్తల మధ్య ఉన్న గొడవలను తగ్గించి వరిని కలిపే ప్రయత్నం చేసే రచ్చబండ లాంటి షో ఇది. విడిపోయిన కుటుంబాలను, భార్య భర్తలను, అత్త కోడళ్ళను, మామ అల్లుళ్ళను కలిపే షో ఇది. ఈ షోకి వెళ్లిన తన భర్త ద్వారా తన కుటుంబ పరువు తీసిందని, ఊర్వశి ప్రశ్నల వల్లే తమ కుటుంబం విడిపోయిందని, తమ కుటుంబాన్ని రచ్చకీడ్చి తమని కలిసేలా చేయకుండా, శాశ్వతంగా తమ ఇంటి గుట్టును బజారున పెట్టిందని కేరళలోని ఒక మహిళ ఆ రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసింది. ఇంకో సంగతి ఏంటంటే.. ఆమె ఆ షోకి ఫుల్ గా మందు కొట్టి వచ్చిందట. ఆ షోలో పాల్గొన్న అందరూ ఆమె ప్రవర్తన చూసి షాక్ అయ్యారట. కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఈమె తాగి వచ్చినట్లు తెలిపోయిందట. త్రాగి వచ్చి చిన్న విషయాన్ని పెద్దది చేసి రచ్చ రచ్చ చేసింది. అయితే ఈమె వల్ల ఒక కుటుంబ గౌరవం పాడు అవ్వడమే కాదు.. ఆమె గౌరవం నవ్వుల పాలైంది. షోలో పాల్గొన్న వారు, షో నిర్వాహకులు, లాయర్లు కూడా ఊర్వశి ప్రవర్తన కి విస్తుపోయారట. కార్యక్రమాన్ని చూసే సాధారణ ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని పసిగట్టారట. అయితే గతసంవత్సరం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు మళ్ళీ ఆ కేసు నడుస్తున్న క్రమం లో మళ్ళీ తెరమీదకి వచ్చింది. ఇంతకీ అప్పుడేం జరిగిందంటే తాగిన మైకంలో అనవసర ఆవేశంతో నానా హంగామా చేసిందట. ఇలాంటి పనుల వల్ల ఈ నటీ నటులు తమ పరువు బజారుపాలు చేయడమే కాదు ఎన్నో కుటుంబాలను కూడా రచ్చకీడుస్తున్నారని ఇటీవల ఆరోపణలెన్నో. మరి మానవ హక్కుల సంఘం ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.

https://www.youtube.com/watch?v=yIE68dXBdPQ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -