Tuesday, April 30, 2024
- Advertisement -

నానిని బుట్ట‌లో ప‌డేసిన అదా శ‌ర్మ

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని వ‌రుస సినిమాల‌తో మంచి జోష‌లో ఉన్నాడు. కృష్ణార్జున యుద్ధం ఇచ్చిన షాక్ నుంచి త్వ‌ర‌గానే కోలుకున్నాడు నాని. నాగర్జున‌తో క‌లిసి తీసిన దేవదాస్ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమా త‌రువాత నాని జెర్సీ అనే మూవీలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో నాని క్రికెట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ న‌టిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. అయితే ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడ‌ట నాని. సినిమాలో మ‌రింత గ్లామ‌ర్ పెంచే ఉద్దేశంతో ఓ సాంగ్ పెట్టే ఆలోచ‌న‌లో ఉన్నాడు ద‌ర్శ‌కుడు.

దీని కోసం అదాశర్మను సంప్ర‌దించార‌ట‌. పూరీ జ‌గ‌న్నాథ్‌-నితిన్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన హర్ట్‌ ఎటాక్‌ సినిమాతో తెలుగు తెర‌కు హీరోయిన్‌గా ప‌రిచియం అయింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించిన‌ప్ప‌టికి ఆమెకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. ప్ర‌స్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. జెర్సీ చిత్ర యూనిట్ ఆమెను ఈ స్పెష‌ల్ సాంగ్ కోసం అడ‌గ‌డం వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది ఈ భామ‌. అదా శర్మ ,నానిల మీద త్వ‌ర‌లోనే ఈ స్పెష‌ల్ సాంగ్‌ను షూట్ చేయ‌నున్నారు. ఈ సినిమా పూర్తి అవ్వ‌గానే విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు నాని. జెర్సీ మూవీని సమ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -