- Advertisement -

పెళ్లి చేసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్ షీలా..!

- Advertisement -

షీలా కౌర్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటి. 2006లో మంచు మనోజ్ హీరోగా వచ్చిన రాజుభాయ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. రాజుభాయ్ మూవీ తర్వాత హలో ప్రేమిస్తారా చిత్రంలో నటించిన షీలాకు ప్రొడ్యూసర్ దిల్ రాజు, అల్లు అర్జున్ పరుగు మూవీ లో ఆఫర్ ఇచ్చారు.

ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించింది షీలా. ఇక అదుర్స్ మూవీ తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. 2018 వరకు అడపాదడపా తమిళ సినిమాల్లో నటించిన షీలా ఆఫర్స్ పూర్తిగా రాకపోవడంతో ఇండస్ట్రీ కి గుడ్ బై చెప్పేసింది. రీసెంట్ గా షీలా పెళ్లి చేసుకుంది. మార్చ్ 12న షీలా వివాహం చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. షీలా భర్త పేరు సంతోష్ రెడ్డి.

ఆయన చెన్నైలోని ఈవీపీ ఫీల్మ్ సీటికి చైర్మన్. తన మ్యారేజ్ ఫొటోస్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ నా లైఫ్ లో కొత్త ఫేస్ స్టార్ట్ చేస్తున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి అంటూ పోస్ట్ చేసింది షీలా. ఆమె ఫోస్ట్ చూసినవారంత కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు షీలా వెడ్డింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -