మొన్నామధ్య ‘శంకరాభరణం’ సినిమా తీసి పాత క్లాసిక్ పేరుని చెడగొట్టిన కోనా వెంకట్ మీద కొందరు పాత సినిమా ప్రేమికులు విరుచుకు పడ్డారు. ఇంకా కోనా చేసిన చిరాకు పని మరచిపోక ముందరే ఇప్పుడు మరొక సూపర్బ్ క్లాసిక్ టైటిల్ ని వాడుతున్నారు . బాపూ సినిమాలలో తలమానికంగా నిలిచిన ముత్యాల ముగ్గు సినిమా టైటిల్ ని భవ్య క్రియేషన్స్ అనే సంస్థ రిజిస్టర్ చేయించింది.
సాధారణంగా గోపీ చంద్ సినిమాలు ఎక్కువగా తీసే వీరు ఈ టైటిల్ రిజిస్టర్ చెయ్యడం విశేషం.ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ తప్ప.. డైరెక్టర్ హీరో వంటి మిగిలిన విషయాలను ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే.. అంతటి మహోన్నతమైన టైటిల్ ని.. ఇప్పటి ట్రెండ్ కి ఉపయోగించడం అంటే.. దాదాపుగా వాటిని అవమానించినట్లే అని ఫీలవుతున్నారు సినీ అభిమానులు. మూవీ మేకర్స్ మాత్రం.. ఇన్ స్టంట్ పబ్లిసిటీ కోసం.. ఆయా సినిమాల టైటిల్స్ ను ఇష్టానుసారం వాడేసుకుంటున్నారు.