Saturday, April 27, 2024
- Advertisement -

అజ్ఞాతవాసి దుబాయ్ రివ్యూ

- Advertisement -

తెలుగులో ఎంత‌గానో ఎదురు చూస్తున్న అజ్ఞాతవాసి దుబాయ్ రివ్యూ రానే వ‌చ్చేసింది.తెలుగులో భారీ హైప్ తో ఉన్న ఏ సినిమా వస్తున్న సరే తనదే ఫస్ట్ రివ్యూ రూపంలో బ‌య‌ట పెట్టే ప్రముఖ దుబాయ్ పంపిణిదారుడు, సెన్సార్ బోర్డు సభ్యుడు ఒకరు అజ్ఞాతవాసి గురించి కూడా ఓపెన్ అయిపోయాడు.ఇత‌ను ఇచ్చే రివ్యూస్ చాలా జ‌న్యుగా ఉంటాయి అని చాలా మటుకు బాక్స్ ఆఫీస్ దగ్గర అలాంటి ఫలితాన్నే అందుకుంటాయి అని టాక్‌. అజ్ఞాతవాసి అత‌ను ఇచ్చిన రిపోర్టు ఏవిధాంగా ఉందో చూద్దాం.

ఇది కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ సినిమా అని సినిమా అంతా వన్ మాన్ షోతో ప‌వ‌న్ న‌డిపించాడు . సినిమాలో ప‌వ‌న్‌ విశ్వరూపం ఇందులో చూడొచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మీద సినిమా సినిమాకు అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి ఆ రకంగా చూసుకుంటే అక్కడక్కడ మెరిపించే మెరుపులు తప్ప కొన్ని చోట్ల డ్రామా ఓవర్ డోస్ ఐన ఫీలింగ్ కలుగుతుంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్ ప‌వ‌ర్ అంతగా ప‌ని చేయ‌లేదని చేప్పాలి. అయినా కూడా ఎంటర్టైన్మెంట్ కి లోటు లేకుండా ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే మేజిక్ చేయటం ఖాయం.హీరోయిన్స్‌కు పెద్ద‌గా నటించటాన‌కి స్కోప్ ఏమి లేద‌నే చేప్పాలి.కీర్తీ సురేష్ హోమ్లీగా క‌నిపించి మెప్పించింది.అను ఇమ్మానుయాల్ మాత్రం త‌న గ్లామ‌ర్‌తో క‌నువిందు చేసింది.విల‌న్‌గా ఆది బాగా చేశాడ‌నే చేప్పాలి.చాలా స్టైలిష్‌గా హుందా పాత్ర‌తో ఆది క‌నిపిస్తాడు.రెగ్యుల‌ర్ విల‌న్లల కాకుండా కొత్త‌గా క‌నిపించి ప‌వ‌న్‌కి సరైనోడిగా ఆది క‌నిపంచాడు.

ఫస్ట్ హాఫ్ కొంచెం యావ‌రేజ్‌ వ్యవహారంలా అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం రేసిగా చాలా ఫాస్ట్ గా తీసుకెళ్ళిన వైనం కట్టిపడేస్తుంది. పవన్ వీక్ నెస్ అనుకున్న డాన్సులు ఇందులో చాలా బాగా చేసాడు. అనిరుధ్ పాటలు అంత‌గా బాలేద‌నే చేప్పాలి.నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకోవ‌డంతో సంభాషణలు చక్కగా కుదిరాయి. యాక్షన్ సీన్స్ మాత్రం గతంలో త్రివిక్రమ్ చేసిన వాటి కంటే చాలా హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే అజ్ఞాతవాసి పైసా వసూల్ మూవీ. క్లాసు, మాసు అనే తేడా లేకుండా అందరిని మెప్పించేలా త్రివిక్రమ్ దీన్ని తీర్చిదిద్దిన తీరుకి ప్రేక్ష‌కుల‌కు విందు భోజ‌నం లాంటిదే . బాక్స్ ఆఫీస్ దగ్గర బలమైన ప్రత్యర్థి బాల‌కృష్ణ ఉండ‌టంతో సంక్రాంతి పోటి ర‌స‌వ‌త్త‌రంగా మారునుంది.అస‌లే బాల‌కృష్ణ‌కు సంక్రాంతి హీరోగా మంచి హిట్స్ ఉన్నాయి. చూద్దాం వీటిన్నిటిని త‌ట్టుకుని అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ ద‌గ్గ‌ర ఏలాంటి ఫ‌లితం రాబ‌డతాడో చూద్దా! సినిమా ఇంకా  విడుద‌ల కాక‌పోవ‌డంతో పాత్ర తీరుతెన్నులు వివ‌రించ‌డం లేదు.

బోటం లైన్: మ‌రో అత్త‌రింటికి కాకుంటే చాలు

https://www.youtube.com/watch?v=bt5_5eHr1HM

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -