హీరో అఖిల్… అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌కు షాక్ ఇచ్చారు ప్రేక్షకులు. అఖిల్, హలో ఇలా తన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. దీంతో అఖిల్ హీరోగా నిలబడగలడా అనే అనుమానం అందరిలోను నెలకొంది. రెండు ఫ్లాప్‌లు తరువాత తొలిప్రేమ వంటి కూల్ హిట్ ఇచ్చిన దర్శకుడు వెంకీ అట్లూరితో తన మూడో సినిమా చేస్తున్నాడు అఖిల్. మిస్టర్ మజ్ను అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ప్లే బాయ్, లవర్ బాయ్‌గా అఖిల్ బాగానే నటించాడనిపిస్తుంది ట్రైలర్‌ను చూస్తుంటే. అయితే ఇలాంటి సినిమాలు , ట్రైలర్లను గతంలో చాలానే చేశారు. కాబట్టి ఈ ట్రైలర్‌కు అనుకున్నంత బజ్ రాలేదు.తొలిప్రేమ వంటి సింపుల్ కథను అద్భుతంగా తెరకెక్కించిన వెంకీ ఈ సినిమాలో కూడా తన మ్యాజిక్‌ను రీపిట్ చేస్తాడని భావిస్తున్నారు అక్కినేని అభిమానులు. మరి మూడో సినిమాతో అయిన అఖిల్‌కు హిట్ వస్తుందో లేదో చూడాలి.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!