అక్కినేని నట వారసుడు అఖిల్ ముచ్చటగా మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తీసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ కావడంతో మూడో సినిమాపై కాస్తా ఫోకస్ పెట్టాడు అఖిల్. మిస్టర్ మజ్ను సినిమాతో రెడీ అయ్యాడు అఖిల్. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. మిస్టర్ మజ్ను సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టాక్ వస్తోంది.
అఖిల్ ఈ సినిమాలో ప్లే బాయ్‌గా నటించాడని ట్రైలర్‌ను చూస్తునే అర్థం అవుతోంది. ఈ సినిమాతో అఖిల్ ఖచ్చితంగా హిట్ కొడతాడని సెన్సార్ సభ్యుడు ఒకరు తెలిపారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – సినిమాటోగ్రఫీ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచినట్లు సమాచారం. ఇక దర్శకుడు వెంకి అట్లూరి ఈ సినిమాలో కూడా తన మ్యాజిక్‌ను రిపీట్ చేశాడని అంటున్నారు. నిధి అగ్వర్వాల్ ఈ సినిమాలో అందంతో పాటు నటనతో కూడా మెప్పించిందని తెలుస్తోంది. మొత్తనికి సెన్సార్ వారు ఈ సినిమా ఫుల్ మార్కులు వేశారు. ఇక సినిమాను ఈ నెల 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’