Saturday, April 27, 2024
- Advertisement -

అక్కినేని హీరోలకు స్టార్ డమ్ వస్తుందా ?

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో ఆయా కుటుంబాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మెగా కుటుంబం, నందమూరి వంశం, గట్టమనేని వంశం, అక్కినేని కుటుంబం.. ఇలా ఆయా కుటుంబాలు స్పెషల్ ఇమేజి ను సంపాదించుకున్నాయి. అయితే ఇండస్ట్రీలో పేరు మోసిన ప్రతి కుటుంబంలోనూ ఉన్న వారసులలో ఒక స్టార్ హీరో ఉన్నాడు. నందమూరి కుటుంబంలో బాలయ్య తరువాత.. వారసుడి హోదాలో జూ. ఎన్టీఆర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అలాగే మెగా కుటుంబం నుంచి చిరంజీవి తరువాత వారసుడిగా రామ్ చరణ్ స్టార్ హోదా అనుభవిస్తున్నాడు. ఇక గట్టమనేని వంశం నుంచి కృష్ణ తరువాత మహేశ్ బాబు సూపర్ స్టార్ ఇమేజ్ కొనసాగిస్తున్నాడు..

అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం నుంచి ప్రభాస్ ఏకంగా నేషనల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.. ఇలా ప్రతి కుటుంబం నుంచి కూడా వారసుడి హోదాలో ఉన్న ప్రతి ఒక్క హీరో స్టార్స్ గా కొనసాగుతున్నారు. కానీ అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున తరువాత ఆయన స్టార్ ఇమేజ్ ను కొనసాగించడంలో ఆయన వారసులు నాగ చైతన్య, అఖిల్ విఫలం అవుతూనే ఉన్నారు. వీరిద్దరు కూడా ఇండస్ట్రీకి వచ్చే ఏళ్ళు గడుస్తున్న ఇంతవరకు స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోలేక పోయారు. అయితే అఖిల్ తో పోలిస్తే నాగ చైతన్య కు సక్సస్ శాతం ఎక్కువగానే ఉన్నప్పటికి ఇంక టైర్ 2 హీరోల జాబితాలోనే కొనసాగుతున్నాడు.

ఇక అఖిల్ అయితే డ్యాన్స్ లలోనూ, ఫైట్స్ లలోనూ ముందంజలో ఉన్నప్పటికి.. వరుస ఫ్లాప్ లతో స్టార్ ఇమేజ్ కు చాలా దూరంలో ఉన్నాడు. అయితే ఈ ఇద్దరు అక్కినేని హీరోలు ప్రస్తుతం స్టార్ ఇమేజ్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం చైతు.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ చైతన్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీతో స్టార్ ఇమేజ్ పైన గట్టిగానే కన్నెశాడు చైతు. ఇక అఖిల్ విషయానికొస్తే.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ” ఏజెంట్ ” అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి విడుదల అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ” ఏజెంట్ ” మూవీ తనకు హిట్ తో పాటు స్టార్ ఇమేజ్ తీసుకొస్తుందని అఖిల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి ఈ ఇద్దరి అన్నదమ్ములకు వారి అప్ కమిగ్ మూవీస్ ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

వాల్తేరు వీరయ్య.. డిస్సపాయింట్ లో ఫ్యాన్స్ !

హిట్ యూనివర్స్ లో బాలయ్య.. 

చిరు, బాలయ్య తో భారీ మల్టీ స్టారర్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -