అక్కినేన నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు అఖిల్. అఖిల్ లాంచింగ్ జరిగినట్లు మరెవ్వరికి జరగలేదు. అఖిల్‌కు వారసత్వంతో ఈజీగానే అవకాశాలు వస్తున్నాయి. అయితే హిట్లు మాత్రం రావడం లేదు. తీసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. అఖిల్ తాజాగా నటించిన చిత్రం మిస్టర్ మజ్ను. సినిమా నిన్న(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాని ఈ అంచనాలను అందుకోవడంలో సినిమా ఫెయిల్ అయిందని తెలుస్తోంది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొంతమంది సినిమా బాగుందని,మరికొంత మంది సినిమా ఏం లేదని చెబుతున్నారు. ఈ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్ల పై చూపించింది. సినిమాకు మొదటి రోజు కలెక్షన్లు యావరేజ్‌గా ఉన్నాయి. సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 5 కోట్ల షేర్స్ ను కూడా అందుకోకపోవడం గమనార్హం. మొదటి రోజు సినిమా అంచనాలకు తగ్గట్టు ఓపెనింగ్స్‌ను అందుకోలేకపోయింది.
నైజం ఏపీలో అయితే 3.5 కోట్ల షేర్స్ మాత్రమే అందినట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాతలకు నష్టాలు తప్పేలా లేవని ఈ కలెక్షన్లు బట్టి అర్థం అవుతోంది. అఖిల్‌కు మూడో సినిమాగా ఫెయిల్ అయిందని కొందరు కామెంట్స్ చేసుకున్నారు.
ఇక ఏరియాల వారీగా వచ్చిన షేర్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజం…….. 1 .02కోట్లు
వైజాగ్……… 0.41కోట్లు
ఈస్ట్………… 0.20కోట్లు
వెస్ట్…………. 0.16కోట్లు
కృష్ణ…………. 0.26కోట్లు
గుంటూరు…… 0.54కోట్లు
నెల్లూరు………. 0.12కోట్లు
సీడెడ్…………. 0.44కోట్లు
ఏపి+తెలంగాణ….. 3.15 కోట్లు
కర్ణాటక…………. 0.68కోట్లు
యూఎస్ఏ……… 0.35కోట్లు
రెస్ట్ ఎస్టిమేటెడ్…… 0.17కోట్లు
వరల్డ్ వైడ్…………. 4.35 కోట్లు (షేర్స్)
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!