Saturday, April 27, 2024
- Advertisement -

ట్రైల‌ర్‌ను చూస్తుంటే హిట్ కొట్టేలా ఉన్నాడే..!

- Advertisement -

అక్కినేని అఖిల్ త‌న తొలి హిట్ కోసం తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. తీసిన మొద‌టి రెండు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోరంగా ఫెయిల్ కావ‌డంతో అఖిల్ కెరీర్‌పై నీలినీడ‌లు అలుముకున్నాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకుని మ‌రి త‌న మూడో సినిమా మిస్టర్ మ‌జ్ను సినిమాను లైన్లో పెట్టాడు. తొలిప్రేమ సినిమాతో తాను ఏంటో నిరుపించుకున్న ద‌ర్శ‌కుడు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు చిత్ర యూనిట్‌. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వ‌చ్చిన ఈవెంట్‌కు, ఆయ‌న చేతుల మీద‌గానే సినిమా ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. నా కోసం ఎవరైనా ఏడిస్తే అది నా తప్పు కాదు. కానీ.. నావల్ల ఒక్కరు ఏడ్చినా అది కచ్చితంగా నా తప్పు అవుతుంది’ , ‘ఇప్పుడు లవ్‌ అంటే.. ముందు కొంచెం లవ్‌చేసుకుని, ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువగా లవ్‌చేసుకుని.. లాస్ట్‌లో పెళ్లి చేసుకుంటారు ఆ టైప్‌ లవ్వా.. నాకు అలా లవ్‌ చేయడం చేతకాదు’ అనే డైలాగ్‌లు హైలెట్‌ అయ్యాయి.

అఖిల్ సినిమాలో మంచి స్టయిలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు. అల్లరి ప్లే బాయ్ గా కొత్తగా ఎదో ట్రై చేశాడు అనిపిస్తోంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. మ‌రి ఈ సినిమాతో అయిన అఖిల్ హిట్ కొడ‌తాడో లేదో చూడాలి. ఇక ఈ సినిమాను ఈ నెల 25న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -