Thursday, May 2, 2024
- Advertisement -

పవన్ కొడుకు అకీరా తెలుగులో ఇష్టమైన హీరో ఎవరంటే ?

- Advertisement -

పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ గురించి సోషల్ మీడియాలో అప్పుడే చర్చ జరుగుతుంది. అకీరా ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు. అతని తెరపై చూడాలన్న కోరికను ఫ్యాన్స్ చెబుతున్నారు. అకీరా ను హీరోగా ఎవరు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు అనేది దాని కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇప్పుడు అకీరా ఫేవరేట్ హీరో గురించి మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. తన తండ్రితో పాటు కుటుంబంలో చాలా మంది హీరోలు ఉన్నా కూడా అకీరాకు మాత్రం చిన్న హీరో అయిన అడివి శేషు అంటే అభిమానమట. ఈ విషయంను స్వయంగా రేణు దేశాయ్ చెప్పింది. నిన్న మదర్స్ డే సందర్బంగా ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పిల్లల గురించి వారి భవిష్యత్తు గురించి రేణు దేశాయ్ స్పందించింది. ఈ సందర్భంగా అకీరా ఇష్టాల గురించి చెప్పింది. అకీరా కు అడవి శేషు అంటే చాలా ఇష్టం.

అతడి ఎవరు చిత్రం చూసినప్పటి నుండి కూడా అతడికి ఫ్యాన్ అయ్యాడు. ఎక్కువగా శేషు అన్నా అంటూ అతడి గురించి అకీరా చెబుతూ ఉంటాడని రేణు చెప్పింది. ఇక అడవి శేషు చేసినవి కొన్ని సినిమాలు అయిన మంచి పేరు సంపాధించుకున్నాడు. క్షణం, గూఢాచారి, ఎవరు చిత్రాలు ఆయన కెరీర్ లో టాప్ గా నిలిచాయి. పవన్ తనయుడిని అభిమానిగా పొందినందుకు అడవి శేషు లక్కీ అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -