Friday, April 26, 2024
- Advertisement -

అసలు సమంత చెప్పిన దానిలో నిజమెంత?

- Advertisement -

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో త్వరలో ఓ బేబీ అనే సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, సునీత తాటి, సురేష్ బాబు మరియు విశ్వ ప్రసాద్ సంయుక్తం గా నిర్మించారు. ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఈ సినిమా జులై 4 న విడుదల కానుండటం తో సమంత వివిధ టీవీ ఛానెల్స్ తో, మీడియా వాళ్ళ తో ముచ్చటిస్తూ సినిమా గురించిన ఆసక్తికర విషయాలు తెలుపుతుంది.

అయితే ఇటీవలే మాట్లాడుతూ సమంత తనకి అవకాశాలు తక్కువ అయిపోయాయి అనే స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే వరుస విజయాలతో, వరుస సినిమాల తో దూసుకెళ్తున్న సమంత ఈ మాట చెప్పడం తో అసలు ఇందులో నిజమెంత అనేది అందరికీ అనుమానం వస్తుంది. నిజానికి ఇది మన అందరికీ అబద్దం అనే అనిపిస్తున్నప్పటికీ సమంత వైపు నుండి దీనికి ఒక ఎక్సప్లనేషన్ ఇచ్చింది.

ఈ మధ్య అందరూ తన దగ్గర కి ఆసక్తికర కతాంశాలతో నే వస్తున్నారట కానీ ఒకప్పటి లాగా మంచి కమర్షియల్ స్క్రిప్ట్స్ తో, గ్లామరస్ పాత్రల తో రావడం లేదు అని చెప్పింది. అందుకే సమంత కొంత నిరుత్సాహపడుతూ నే మంచి సినిమాల లో నటిస్తున్నందుకు సంతోషం గా ఉందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -